ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 27 2026 9:59 AM | Updated on Mar 27 2026 9:59 AM

వనపర్తిటౌన్‌: ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 2వ విడత రాయితీ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సిరాజుద్దీన్‌ అహ్మద్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువతీ, యువకులు https://tgobmms. cgg.gov.in వెబ్‌సైట్‌లో ఏప్రిల్‌ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాజీవ్‌ యువ వికాసానికి సైతం ఆసక్తిగల అభ్యర్థులు ఎస్సీ కార్పొరేషన్‌కు దరఖా స్తు చేసుకోవచ్చని సూచించారు.

వేలం వాయిదా

వనపర్తి టౌన్‌: స్థానిక పురపాలికలో 2026–2027 సంవత్సరానికిగాను గురువారం జరగాల్సిన తైబజార్‌, పశువుల సంత, జంతువధశాల బహిరంగ వేలానికి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రానందున వాయిదా వేసినట్లు పుర కమిషనర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన బహిరంగ వేలాన్ని ఎప్పుడు నిర్ణయించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement