మూడు ప్రధాన వైద్య పరీక్షలు..
కలెక్టర్ ప్రత్యేక చొరవతో రూపొందించిన మధుమేహ దృష్టి కార్యక్రమంలో మధుమేహ వ్యాధ్రిగస్తులకు మూడు ప్రధాన వైద్య పరీక్షలు చేస్తాం. లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయస్సురీత్యా వచ్చే కంటి సమస్యలేమైనా ఉన్నాయా పరీక్షిస్తాం. అవసరం మేరకు జిల్లా అస్పత్రి, హైదరాబాద్‌లోకి సరోజిని కంటి ఆస్పత్రికి రెఫర్ చేస్తాం. శుక్లాల శస్త్రచికిత్స సైతం జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉంది.
– డా. రాంచందర్‌రావు, కార్యక్రమ అధికారి
మానవాళిని పట్టిపీడిస్తున్న మధుమేహ నియంత్రణకు వ్యాయామం, ఆహారపు అలవాట్లు, వైద్యుల సూచనలు పాటించాలి. మధుమేహం ప్రభావంతో కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు, చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మధుమేహ దృష్టి కార్యక్రమాన్ని రూపొందించాం. వ్యాధగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఆదర్శ్ సురభి, కలెక్టర్
●
మూడు ప్రధాన వైద్య పరీక్షలు..


