రెండ్రోజులుగా ఇక్కడే ఉన్నాం..
దేవరకద్ర మండలం నుంచి మిడ్జిల్ మండలంలోని రాణిపేట శివారులోని సీసీఐ కేంద్రానికి ఆదివారం పత్తిని బొలెరో వాహనంలో తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చాక బంద్ ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రోజురోజుకూ బండి కిరాయి పెరుగుతుంది. ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను తీర్చాలి.
– ఆనంద్, పత్తి రైతు,
అమ్మాపూర్, దేవరకద్ర మండలం
వాహనం అద్దె పెరుగుతుంది..
మిడ్జిల్ మండలంలోని రాణిపేట శివారులోని సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకొని ఆదివారం సాయంత్రం వచ్చాం. త్వరగా అమ్ముకొని పోదాం అనుకున్నాం. బంద్ ఉండడంతో వాహనం అద్దె పెరుగుతుంది. దీంతో ఇంటి దగ్గర పనిపోతుంది. ఇక్కడ మాకు ఖర్చులు అవుతున్నాయి.
– తౌర్యనాయక్, పత్తి రైతు, మరికల్, నాగర్‌కర్నూల్ జిల్లా
గద్వాల నుంచి వచ్చినం..
శనివారం స్లాట్ బుక్ చేసుకోగా మిడ్జిల్ మండలంలోని రాణిపేట శివారులోని సీసీఐ కేంద్రానికి వచ్చింది. గద్వాల నుంచి వచ్చి 3 రోజులు అవుతుంది. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఇన్నిరోజులు ఉండాలంటే మాకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కిరాయితోపాటు ఖర్చులు పెరిగిపోతున్నాయి.
– రమేష్, పత్తి రైతు, గద్వాల
దిక్కుతోచడం లేదు..
రెండ్రోజుల కిందనే స్లాట్ బుక్‌చేసుకొని వినాయక మిల్లు దగ్గర పత్తిని ట్రాక్టర్‌లో తీసుకొస్తే క్యూలైన్‌లో నిలబెట్టారు. ఇప్పుడు కాటన్ మిల్లు బంద్ అని చెప్పడంతో దిక్కుతోచడం లేదు. స్లాట్ క్యాన్సల్ చేసుకొని మళ్లీ బుక్ చేసుకుంటే ఆ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు.
– దేవర రాము, లింగంపల్లి,
మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా
●
రెండ్రోజులుగా ఇక్కడే ఉన్నాం..
రెండ్రోజులుగా ఇక్కడే ఉన్నాం..
రెండ్రోజులుగా ఇక్కడే ఉన్నాం..


