బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
పాన్‌గల్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలన్నారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. బాలికలు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని సూచించారు. బాలల న్యాయ చట్టం, పోక్సో చట్టం గురించి విద్యార్థులకు వివరించారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించే వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు, కౌన్సిలర్ స్వరూప, జెండర్ స్పెషలిస్ట్ సలోమి, ఆర్డీఎస్టీ సభ్యుడు రాజశేఖర్, కేజీబీవీ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి విద్యావిభాగం: ఈఎంఆర్‌ఐ సంస్థలో 102 వాహనాల పైలెట్ల (డ్రైవర్ల) నియామకానికి అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు, ఎల్‌ఎంవీ (బ్యాడ్జీ) లైసెన్‌న్స్ కలిగిన వారు అర్హులన్నారు. జిల్లాలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని.. ఒరిజినల్ ధ్రువపత్రాలతో నర్సింగాయపల్లిలోని ప్రభుత్వ మెటీర్నరీ, చిల్డ్రన్ ఆస్పత్రిలో హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 99498 21962 సంప్రదించాలని సూచించారు.
కురుమూర్తిస్వామికి రూ.24.83లక్షల ఆదాయం
చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులు కానుకలుగా సమర్పించిన రెండో హుండీని మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ.24,83,628 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ పరిశీలకులు శ్రీనివాస్, ఆలయ పాలక మండలి సభ్యులు భారతమ్మ, బాదం వెంకటేశ్వర్లు, గౌని రాము, నాగరాజు, కమలాకర్, ప్రభాకర్‌రెడ్డి, ఉంధ్యాల శేఖర్, ఆలయ పూజారులు వెంకటయ్య, సత్యనారాయణ, విజయ్‌లక్ష్మి నరసింహచార్యులు, పాల్గొన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి


