పోలీస్ ప్రజావాణికి 8 ఫిర్యాదులు
వనపర్తి: పోలీసులు అప్రమత్తంగా ఉండి బాధితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. అప్పుడే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరుగుతుందన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 8 మంది ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై ఎస్పీ రావుల గిరిధర్ ఫిర్యాదులు అందించారు. ప్రతి ఫిర్యాదును అప్పటికప్పుడే సంబంధిత పోలీస్‌స్టేషన్ బదలాయించి, తక్షణమే చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు తహసీల్దార్ మురళీగౌడ్, ప్రొఫెసర్లు శంకర్, కృష్ణతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్‌రెడ్డి, నాయకులు వెంకట్రాములు, ముకుందంగౌడ్, రాంరెడ్డి, దయాకర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, లక్ష్మన్‌నాయుడు, ప్రభాకర్‌గౌడ్, బాలకృష్ణనాయుడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి క్రీడా పోటీలు
వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల ఎంజేపీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 11 నుంచి 18 వరకు ఉమ్మడి జిల్లా అండర్ 14, 17, 19 క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రశాంతి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ గురుకుల పాఠశాలు, 4 కళాశాల నుంచి 450 విద్యార్థులు పాల్గొంటారని ఆమె తెలిపారు.
నిలకడగా రామన్‌పాడు నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జ లాశయం సోమవారం సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. సమాంతరంగా వచ్చే నీటిని నిలిపివేశారు. తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విని యోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.
పోలీస్ ప్రజావాణికి 8 ఫిర్యాదులు


