ఇంటర్‌లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
పాన్‌గల్: వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపక బృందం విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా ఇంటర్మీడియట్(డీఐఈఓ) అధికారి ఎర్ర అంజయ్య సూచించారు. సోమవారం పాన్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే ల్యాబ్‌లు, సబ్జెక్టుల వారీగా అధ్యాపకుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో వార్షిక పరీక్షలు ఉన్నందున సిలబస్‌సు త్వరగా పూర్తి చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. కళాశాలల్లో 90 రోజుల ప్రణాళికను పక్కగా అమలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడుతూ.. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు శాతాన్ని ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షిస్తున్నందున విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలన్నారు. అధ్యాపక బృందంతో సమావేశం నిర్వహించి వార్షిక పరీక్షలు, విద్యార్థుల సన్నద్ధంపై పలు సూచనలు, సలహాలు అందించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ తిరుమల్‌రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


