కేసులు చేధిస్తున్నాం..
గతంతో పోల్చితే.. మిస్సింగ్ కేసులు పెరిగినా ఆశించిన స్థాయిలోనే వాటిని చేధిస్తున్నాం. ఇటీవల టౌన్ పీఎస్‌లో నమోదు చేసిన కురుమూర్తి మిస్సింగ్ కేసులో భార్య ప్రియుడితో కలిసి ఇంట్లోనే చంపి శ్రీశైలం వద్ద కృష్ణానదిలో పడేసినట్లు నిర్ధారణ అయ్యింది. మృతదేహాన్ని తమ సిబ్బంది గుర్తించారు. రూరల్ పీఎస్‌లో నమోదైన ఎద్దులగేరి ప్రాంతానికి చెందిన వ్యక్తి కోసం కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టినా.. ఎలాంటి ఆచూకీ లభించలేదు. దర్యాప్తు చేస్తున్నాం. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. – వెంకటేశ్వర్‌రావు, డీఎస్పీ, వనపర్తి
●


