నక్కలగండి పునరావాస బాధితులకు న్యాయం చేస్తాం..
నక్కలగండి రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌తో పంట నష్టానికి గురైన మార్లతండా, కేశతండా గ్రామస్తులకు ప్రభుత్వం తరపున పరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మరోసారి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆదర్శ సురభి, డీఐజీ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, సీఈలు విజయ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
