15 న ప్రత్యేక లోక్ అదాలత్
వనపర్తిటౌన్: కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని తెలిపారు. సోమవారం జిల్లా కోర్టులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జడ్జిలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిమినల్, చెక్‌బౌన్స్, మెయింటెనెన్స్, గృహహింస చట్టం, ప్రమాద బీమా క్లెయిమ్, సివిల్, వైవాహిక, వినియోగదారుల, ఆస్తి విభజన, భూమి, కుటుంబ వివాదాలు రాజీకి పరిష్కారానికి యోగ్యమైన క్రిమినల్ కేసులను స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.కళార్చన, జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్‌కుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
‘కార్మిక హక్కులు
కాలరాయొద్దు’
అమరచింత: కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం ఆరోపించారు. మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20 నుంచి 24 వరకు శ్రామిక ఏకతా మహాసంఘ్, టీయూసీఐ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని పుణె పట్టణంలో అంతర్జాతీయ ఆటోమేటివ్ వర్కర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో ఆటో, ఆటో విడిభాగాల పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు. సమావేశంలో హనుమంతు, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాజు, కురుమన్న, ప్రేమరత్నం, మస్లమని ఉన్నారు.
అతిథి అధ్యాపక పోస్టుకు ఇంటర్వ్యూ
వనపర్తి రూరల్: జిల్లాలోని పెద్దగూడెం శివారులోని ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ బీఎస్‌సీ (హాన్స్) వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ ఎకనామిక్స్ బోధించేందుకు ఒక అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వ్యవసాయ కళాశాల ప్రిన్స్‌పాల్ ప్రశాంతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్‌లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పీహెచ్‌డీ, ఎన్‌ఈటీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటు దని తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్ ధ్రువపత్రాలు, 2 పాస్‌ఫొటోలు, పూర్తి బయోడేటా తీసుకొని ఈ నెల 6న పెద్దగూడెం శివారులోని హాన్స్ వ్యవసాయ కళాశాలల్లో నిర్వహించే ఇంటర్‌ూయ్వలకు హాజరు కావాలని కోరారు.
నిండుకుండలా
రామన్‌పాడు జలాశయం
మదనాపురం: మండల పరిధిలోని రామన్‌పాడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. సోమవారం నాటికి సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం1,021 అడుగులకు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, సమాంతరంగా 195 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ ద్వారా 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రాసాద్ తెలిపారు.


