
అక్టోబర్ 15 వరకు..
ముడుమాల్ వద్ద రిహాబిలిటేషన్ సెంటర్‌కు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి.. వచ్చేనెల 15 వరకు పనులు మొదలుపెడుతాం. దీంతోపాటు ఎక్కడైతే కృష్ణ జింకలు ఎక్కువ ఉన్నాయో.. అక్కడ మినీ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్‌కు.. ఆ తర్వాత క్రమంగా నల్లమల లేదా కవ్వాల్ అడవులకు తరలిస్తాం. నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో మినీ రిహాబిలిటేషన్ సెంటర్ కోసం పది ఎకరాల్లో భూమి గుర్తించాం. ఇక్కడ పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ సెంటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– అరవింద్‌రెడ్డి, డీఎఫ్‌ఓ, నారాయణపేట
నేను 20 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కాయలు కాసే దశ. ప్రతిరోజూ కాపలా ఉంటున్నా. ఇప్పుడే కాదు.. విత్తనాలు పెట్టిన నాటి నుంచి పత్తి చేతికొచ్చే వరకూ జింకలు రాకుండా ప్రతిరోజూ నాకు ఇదే పని. జింకలను ఇక్కడి నుంచి అటవీ ప్రాంతానికి తరలిస్తేనే మా సమస్య తీరుతుంది. అధికారులు ఇప్పటికై నా పటిష్ట చర్యలు తీసుకోవాలి.
– బస్లింగప్ప, చేగుంట, కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా