
‘ప్రజావాణి’ ఫిర్యాదులు పరిష్కరించాలి..
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ఫిర్యాదుదారులతో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి వినతులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు 40 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వివరించారు.