
‘కాలగమనం’ పుస్తకావిష్కరణ
వనపర్తిటౌన్: జిల్లా సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో రచయిత డా.కంటె నిరంజనయ్య రచించిన ‘కాలగమనం’ పుస్తకాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజాన్ని చైతన్యపరిచే రచనలు మరిన్ని రావాలని అన్నారు. కవులు తమ కవిత్వాన్ని సమాజానికి స్ఫూర్తినిచ్చేలా రచించాలని సూచించారు. ఆనాటి కవులు కల్పిత సాహిత్యంతో పాటు యాదార్థ విషయాలను కళ్లకు కట్టినట్లు రచించే వారని.. పాఠకులను కదిలించే కవిత్వాలు రావాలని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ అన్నారు. అనంతరం కంటె నిరంజనయ్యను పలువురు కవులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాండు, జనజ్వాల, ఎంఈఓలు మద్దిలేటి, నర్సింహ, జైభీమ్ సంస్థ అధ్యక్ష, కార్యద ర్శులు బండారు శ్రీనివాస్, రాంబాబు, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి కబడ్డీ
జట్ల ఎంపిక
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్ హైస్కూల్ మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి కబడ్డీ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో బాలికలు 48 మంది, బాలురు 85 మంది పాల్గొన్నట్లు అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 25నుంచి 28వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కుర్మయ్య, ఉపాధ్యక్షుడు దామోదర్, కోశాధికారి గోపాలం, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్‌గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శులు మధు, వెంకట్రాములు, ఈసీ మెంబర్ కమలాకర్ పాల్గొన్నారు.

‘కాలగమనం’ పుస్తకావిష్కరణ