
కమిటీ తీర్మానం ఎలా సాధ్యం?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కొత్త మిల్లుకు కోడ్ ఇచ్చి ధాన్యం కేటాయించాలంటే యజమాని చేసుకున్న దరఖాస్తును డీఎస్‌ఓ కార్యాలయంలో పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. సాటెక్స్‌తో పాటు అగ్నిమాపక, విద్యుత్, పరిశ్రమలు, మార్కెట్‌శాఖ అనుమతి పొందారని నిర్ధారించుకొని పంచనామా నివేదిక సిద్ధం చేసి డీఎస్‌ఓకు అందజేయాలి. ఆయన ఈ నివేదికను కమిటీ ముందు ఉంచితే.. వారు సంతృప్తి చెంది అందరి ఆమోదం మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ వద్దకు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు సిఫారస్ చేసేందుకు దస్త్రం పంపిస్తారు. కమిషనర్ కోడ్ ఇచ్చిన తర్వాత ధాన్యం కేటాయింపులకు సైతం కమిషనర్‌కు పంపించాల్సి ఉంటుంది. కానీ మద్దిగట్ల మిల్లు విషయంలో నిబంధనలను తుంగలో తొక్కి ధాన్యం కేటాయింపులు చేసినట్లు స్పష్టమవుతోంది.