
ఎదగని వరి పంట
నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 18 బస్తాల యూరియా వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు లభించకపోవడంతో పంట రంగుమారి గిటుక బారినట్లు
అయింది. వారం రోజులు తిరిగితే మంగళవారం 12 బస్తాలు లభించింది.
ఇప్పటికే మొదటి విడత పూర్తిచేసి రెండోవిడత వేయాల్సి ఉంది. గతంలో
సింగిల్‌విండోతో పాటు ప్రైవేట్‌గా యూరియా లభించేది. ప్రస్తుతం సింగిల్‌విండోలో మాత్రమే
లభిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – తిరుపతిరెడ్డి, రైతు, వెంగళాయిపల్లి (పాన్‌గల్)
●