
నష్ట పరిహారం అందేనా..?
అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలు
●
అమరచింత: ఇటీవల కురిసిన అధిక వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన వివిధ రకాల పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. జిల్లాలోని 11 మండలాలు.. 70 గ్రామాల్లో 560 ఎకరాల పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకుంటామని ప్రకటించడంతో కాస్త ఊరట లభించినా.. ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో పరిహారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు దాపురించాయి. ఈసారి వానాకాలంలో జిల్లావ్యాప్తంగా వరి, మొక్కజొన్న, కంది, వేరుశనగ, పత్తి, ఉల్లి, ఎర్ర మిరప పంటలు అధికంగా సాగు చేశారు. వీటిలో అత్యధికంగా వరి పంట వర్షపు నీటిలో మునిగి ఇసుక మేటలు వేయడంతో అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
● అమరచింత మండలంలో 32 ఎకరాల్లో పత్తి, వరిపంట నీట మునిగింది.
● కొత్తకోట మండలంలోని 9 గ్రామాల్లో 65 ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిని 104 మంది రైతులు నష్టపోయారు.
● మదనాపురం మండలంలో 37 మంది రైతుల 13 ఎకరాల వరి పంట నీట మునిగి ఇసుక మేటలు వేసింది.
● చిన్నంబావి మండలంలో మొక్కజొన్న, ఉల్లి, 2 ఎకరాల్లో పత్తి, 4 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది.
● పాన్‌గల్ మండలంలో 45 మంది రైతులకు సంబంధించి 40 ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి.
● గోపాల్‌పేట మండలంలో పత్తి, వరి, కంది, పెసర పంట 60 ఎకరాలు.. రేవల్లి మండలంలో 41 మంది రైతులు 36 ఎకరాల పత్తి, వరి పంట.. ఏదుల మండలంలో కంది, మిరప పంటలు 13 ఎకరాల్లో నష్టపోయారు.
● పెబ్బేరు మండలంలో ఆముదం, వేరుశనగ, ఉల్లి, వరి, మిర్చి పంటలు సుమారు 91 ఎకరాలకు నష్టం వాటిల్లింది.
● పెద్దమందడి మండలంలో 103 మంది రైతులు 104 ఎకరాల్లో పత్తి, వరి పంటలను సాగుచేసి వర్షాల కారణంగా నష్టాలను చవిచూశారు.
● వనపర్తి మండలంలో 73 మంది రైతులు సాగు చేసిన 42 ఎకరాల వరి, ఆముదం, మొక్కజొన్న పంటలకు నష్టం వాటల్లింది.
మండలం గ్రామాలు పంటనష్టం రైతులు
(ఎకరాలో..)
పెబ్బేరు 11 98.21 54
పాన్‌గల్ 11 41.04 46
వనపర్తి 10 47.21 83
కొత్తకోట 9 66.18 106
గోపాల్‌పేట 6 60.34 68
పెద్దమందడి 6 107.24 106
మదనాపురం 4 13.16 37
రేవల్లి 4 37.05 42
ఏదుల 4 13.38 13
అమరచింత 3 22.24 32
చిన్నంబావి 2 51.20 45
మండలాల వారీగా పంట నష్టం వివరాలు..
పంటల వారీగా..
జిల్లావ్యాప్తంగా 70 గ్రామాల్లో 560 ఎకరాల నష్టం
అత్యధికంగా వరి పంట..
నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్న అధికారులు

నష్ట పరిహారం అందేనా..?