
వరి నీట మునిగింది..
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో 4 ఎకరాల్లో వరి సాగు చేశా. ఆగస్టులో కురిసిన అధిక వర్షాలకు రెండు ఎకరాల పంట పూర్తిగా వరద నీటిలో మునిగింది. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి కాగా.. రూ.40 వేల వరకు నష్టం వాటిల్లింది.
– రాజు, రైతు, నందిమళ్ల (అమరచింత)
ఎకరా పంట దెబ్బతింది..
ఇటీవల కురిసిన అధిక వర్షాలకు ఎకరా వరి పంట నీట మునిగింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులకు తెలియచేశా. రూ.20 వేలు పెట్టుబడి అయింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– ఎస్.కురుమన్న, ఖానాపురం
ప్రభుత్వానికి నివేదించాం..
అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. ఏఈఓలు పంటలు, రైతుల వివరాలు.. ఎంత మేర పంట నష్టం వాటిల్లింది అనే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి వివరాలను నివేదించాం. నష్ట పరిహారం వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో జమచేస్తాం.
– దామోదర్, ఏడీఏ, కొత్తకోట

వరి నీట మునిగింది..