
నేడు మంత్రులు పొంగులేటి, జూపల్లి రాక
వనపర్తి: పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవాలకు శనివారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, గృహ నిర్మాణశాఖ డైరెక్టర్ వస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతం గ్రామంలోనే బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో
మిలాద్–ఉన్–నబీ
అమరచింత: జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు శుక్రవారం మిలాద్–ఉన్–నబీని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, దివ్యా ఖురాన్ పఠనం చేస్తూ జాగరం చేశారు. అమరచింత జామియా మసీదులో శుక్రవారం అన్న ప్రసాద వితరణ చేశారు. నబీసా మసీద్‌లో మహ్మద్ ప్రవక్త కేశాలను ఆసర్ ముఖారక్ ద్వారా భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ముస్లింలు మసీద్‌కు చేరుకొని ప్రవక్త కేశాలను దర్శించుకున్నారు. వందల ఏళ్ల కిందట మక్కా, మదీనాకు ఇక్కడి నుంచి వెళ్లిన ముస్లింలు ప్రవక్త కేశాలను భక్తితో ఇక్కడికి తీసుకొచ్చి ఏటా దర్శించుకునేలా ఉర్సు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నబీషా మసీద్ నిర్వాహకులు తెలిపారు.
వట్టెంలో ముగిసిన
వెంకన్న పవిత్రోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఆలయ అర్చక బృందం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు, మహాపూర్ణాహుతి, పవిత్ర మాలధారణ వంటివి జరిపించారు. చివరిరోజు నిర్వహించిన స్వామివారి పవిత్రోత్సవాల కార్యక్రమానికి వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్‌రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంత నర్సింహారెడ్డి, కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, సురేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. పవిత్రోత్సవాలను తిలకిచండానికి ఆయా ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

నేడు మంత్రులు పొంగులేటి, జూపల్లి రాక