
పేదల సొంతింటి కల సాకారం
వనపర్తి రూరల్: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండలం తోమాలపల్లిలో ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్ల పాటు ఎదురుచూసినా ఇళ్ల నిర్మాణాలు జరగలేదని.. రెండు పడకల గదుల ఇల్లు కేటాయించాలని నాయకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతో వారి కళ్లల్లో సంతోషం కనబడుతుందని తెలిపారు. అనంతరం అదే గ్రామంలో కొద్దిరోజలు కిందట అనారోగ్యంతో మృతిచెందిన గొల్ల విష్ణు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. పెబ్బేరులో జరిగిన మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌పార్టీ నాయకులు అక్కి శ్రీనివాస్‌గౌడ్, సురేందర్‌గౌడ్, రామన్‌గౌడ్, నరేందర్, వెంకటేష్‌సాగర్, రంజిత్, షకీల్, ఎండీ అఫ్సర్, మైనుద్దీన్, షబ్బీర్, మాజీద్, ముస్తాక్, అతిక్‌పాషా, బాషా, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి