
మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్ఫలితాలు
కొత్తకోట రూరల్: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.రజిని అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని నివేదిత డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు తీసుకోవడం వలన మేథోపరమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు. మాదకద్రవ్యాలను విక్రయించడం, కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని, కేసులు నమోదవుతాయని తెలియజేశారు. గూగుల్‌లో నషా ముక్త్ భారత్ సైట్‌ను సందర్శించి డ్రగ్స్ తీసుకోం అని ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. అదేవిధంగా కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ సభ్యుల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో తమ పిల్లలు ర్యాగింగ్‌కు పాల్పడరని అంగీకార పత్రం తీసుకోవాలని తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తి మోహన్‌కుమార్, కళాశాల డైరెక్టర్ సూరిబాబు, కళాశాల సిబ్బంది సహదేవుడు, వెంకటేష్ గౌడ్, విద్యార్థులు ఉన్నారు.