
ప్రవాహం.. ప్రమాదం
ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద రోజురోజుకు పెరుగుతోంది. కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వివిధ ప్రాంతాల సందర్శకులు తరలివస్తున్నారు. ఆదివారం దిగువ పుష్కరఘాట్ నది సమీపంలోకి వెళ్లే రహదారి మూసి ఉంచినా పర్యాటకులు మాత్రం ఉధృతంగా పారుతున్న జలాల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడంతో పాటు స్నానాలు చేయడం కనిపించింది. ఆదమరిస్తే ప్రమాదమని తెలిసినా.. ఎగిసి పడుతున్న జలాల ముందు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. నిత్యం పహారా కాస్తున్నామని చెబుతున్న పోలీసులకు వీరిని గమనించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. – అమరచింత

ప్రవాహం.. ప్రమాదం

ప్రవాహం.. ప్రమాదం