
క్షణికావేశం సరికాదు..
జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అధికంగా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, చదువులో రాణించకపోవడం వంటి కారణాలతోనే జరుగుతున్నాయి. ఆత్మహత్యల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా పట్టాలపై అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఇలాంటి వారిని జిల్లాలో చాలా వరకు గుర్తించాం.
– రాజా, రైల్వే ఎస్‌ఐ, మహబూబ్‌నగర్
తల్లిదండ్రుల పాత్ర కీలకం..
చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో చర్చించుకోవాలి. ఏ సమస్యకై నా పరిష్కారం ఉంటుంది. ఇది చిన్న వయస్సు వారిలో అంతగా అర్థం కాదు. 20 నుంచి 30 ఏళ్లలోపు వారిలో హర్మోన్లు ఎక్కువగా పెరుగుతాయి. అన్నీ సాధిస్తామని అనుకుంటారు.. చిన్న చిన్న సమస్యలు వచ్చినా తట్టుకోలేరు. ఎక్కువ మంది ఆకర్షణకు లోనై అనుకున్నది సాధించలేనప్పుడు ఆత్మహత్యల వరకు వెళ్తుంటారు. మరికొందరు మత్తు పదార్థాలకు బానిసై మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి వారిపై తల్లిదండ్రులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి.
– డా. అనిల్‌రాజ్, మానసిక వైద్యుడు
●