వణికిస్తున్న డెంగీ.. | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న డెంగీ..

Aug 31 2025 12:35 AM | Updated on Aug 31 2025 12:35 AM

వణికి

వణికిస్తున్న డెంగీ..

విష జ్వరాల నివారణకు చర్యలు..

తూతూమంత్రంగా డ్రైడే..

పల్లెల్లో లోపించిన పారిశుద్ధ్యం

జిల్లాలో విష జ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. డెంగీ కేసు నమోదైన గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదయ్యాయి. కలెక్టర్‌ ఆదేశాలతో ఏఎల్‌ఓ బృందాలతో దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నాం.

– డా. శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి

అమరచింత: గ్రామాల్లో డెంగీ పంజా విసురుతోంది. ఆగస్టు నెలలో జిల్లావ్యాప్తంగా 12 కేసులు నమోదు కాగా.. ఈ సీజన్‌ మొత్తం 28 కేసులు నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సీజనల్‌ వ్యాధిగ్రస్తులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వీటితో పాటు గ్రామాల్లోని ఆర్‌ఎంపీ క్లీనిక్‌లను రోగులు ఆశ్రయిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల అమరచింత మండలం కొంకన్వానిపల్లెలో 11 ఏళ్ల బాలుడికి డెంగీ నిర్ధారణ కావడంతో వైద్యబృందం గ్రామంలో పర్యటించి దోమల నివారణ మందు పిచికారీ చేయడంతో పాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అనుమానితుల రక్త నమూనాలు సేకరించారు. అంతేగాకుండా ఖిల్లాఘనపురంలోని ప్రభుత్వ వసతి గృహం, కొత్తకోటలోని గురుకుల విద్యార్థులు విష జ్వారాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ఈ నెలలో ఆత్మకూర్‌ మండలంలో 5 డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు లెక్కలు వేస్తున్నారే తప్ప విష జ్వరాలు, దోమల నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. డ్రెయినేజీలు శుభ్రం చేయడంతోనే సరిపెడుతున్న పంచాయతీ అధికారులు దోమలు, ఈగల నివారణకు సరైన చర్యలు చేపట్టడం లేదు.

పేరుకే పల్లె దవాఖానాలు..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి వైద్యులను నియమించి ప్రజలకు వైద్య సేవలు సకాలంలో అందించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఇక్కడి వైద్యులను మండల కేంద్రంలోని పీహెచ్‌సీలకు కేటాయించడంతో పల్లె దవాఖానాలు కేవలం సూచిన బోర్డులకే పరిమితమయ్యాయి.

నామమాత్రంగా ఆరోగ్య సర్వే..

గ్రామాల్లో ఆరోగ్యశాఖ చేపట్టే వైరల్‌ ఫీవర్‌ సర్వే నామమాత్రంగా కొనసాగుతోంది. సర్వే ఆశ వర్కర్లతో చేపడుతున్నారని.. ఏఎన్‌ఎంలతో పాటు హెల్త్‌ సూపర్‌వైజర్‌, పీహెచ్‌సీ వైద్యులను భాగస్వాములు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆశించిన మేర కొనసాగడం లేదు. ప్రతి వారం కార్యక్రమం నిర్వహిస్తున్నామంటూ పత్రికలకు ఫొటోలిస్తూ చేతులు దులుపుకొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే తప్ప వైద్య శిబిరాలు నిర్వహించలేని పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పొంచి ఉన్న విష జ్వరాల ముప్పు

అస్వస్థతకు గురవుతున్న ప్రజలు

ఆస్పత్రుల్లో రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య

ఫాగింగ్‌కు నిధులు లేక చేతులెత్తేసిన అధికారులు

వణికిస్తున్న డెంగీ.. 1
1/2

వణికిస్తున్న డెంగీ..

వణికిస్తున్న డెంగీ.. 2
2/2

వణికిస్తున్న డెంగీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement