రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు

Aug 30 2025 7:16 AM | Updated on Aug 30 2025 7:16 AM

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు

పాన్‌గల్‌: వ్యవసాయ కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించిన రైతులకు సామగ్రి అందించే విషయంలో ఇబ్బందులకు గురి చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని దావాజిపల్లిలో రూ.1.97 కోట్లతో నిర్మించే 33 కేవీ సబ్‌స్టేషన్‌, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో సబ్‌స్టేషన్లు నిర్మిస్తుందన్నారు. ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో దావాజిపల్లి, దొండాయిపల్లి, దొండాయిపల్లితండా, అన్నారం, అన్నారంతండాతో పాటు వనపర్తి మండలం ఖాసీంనగర్‌, అంజనగిరి గ్రామాల వినియోగదారులకు మేలు చేకూరుతుందని తెలిపారు. రైతులు డీడీలు చెల్లించిన 60 రోజుల్లో కనెక్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెలను కాంట్రాక్టరే నిర్మించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని.. అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేద లబ్ధిదారులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దావాజిపల్లి – ఖాసీంనగర్‌ మట్టి రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు మంత్రి దృష్టికి తీసుకురాగా మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశాలు నిర్వహించి సమస్యలను గుర్తించాలన్నారు.

● సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీశాఖ అధికారులు తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ మండలంలోని కిష్టాపూర్‌తండా గిరిజన రైతులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. గోప్లాపూర్‌ స్టేజీ సమీపంలో మంత్రి కాన్వాయ్‌ను నిలిపి సమస్యను మంత్రికి విన్నవించారు. మంత్రి సమస్యలను సానుకూలంగా విని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మండలంలో ఏర్పాటు చేసే గురుకుల పాఠశాలకు కేతేపల్లి సమీపంలో ప్రభుత్వ భూమిని మంత్రి పరిశీలించి రైతులు సాగు చేస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. పాఠశాల నిర్మాణానికి సరిపడా స్థలం అందుబాటులో ఉందా, అనువైన ప్రాంతమా కాదా అనే విషయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌, విద్యుత్‌శాఖ ఏస్‌ఈ రాజశేఖరం, డీఈ శ్రీనివాస్‌, ఏడీఏ రాజయ్యగౌడ్‌, ఏఈ చందన్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, కాంగ్రెస్‌ నాయకులు రవికుమార్‌, వెంకటేష్‌నాయుడు, మధుసూదన్‌రెడ్డి, రాముయాదవ్‌, వెంకటయ్యయాదవ్‌,ఠాకూర్‌నాయక్‌, లోక్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement