
అన్నదాతల అవస్థలు
ఆత్మకూర్/అమరచింత/పాన్‌గల్: యూరియా కోసం జిల్లా అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆత్మకూర్ పీఏసీఎస్‌కు శుక్రవారం ఉదయం నుంచే రైతులు వరుస కట్టారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 300 బస్తాలు రాగా ఆత్మకూర్ రెండో ఎస్‌ఐ హిమబిందు రాథోడ్, సిబ్బంది పోలీసులు వరుస క్రమంలో నిలబెట్టి సాయంత్రం వరకు 142 మంది రైతులకు పంపిణీ చేశారు. మిగిలిన 196 మంది రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు.
● అమరచింత ఆగ్రో రైతు సేవాకేంద్రానికి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే రైతులు చేరుకొని వరుసలో నిల్చున్నారు. 300 బస్తాల యూరియా రాగా గతంలో తీసుకెళ్లిన రైతులకు ఇవ్వమని.. తీసుకెళ్లనివారికి పాసు పుస్తకానికి రెండు సంచులు మాత్రమే ఇస్తామని ఏఓ అరవింద్ చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులు గంటల తరబడి పడిగాపులు పడి రెండు సంచులు తీసుకెళ్లడం కనిపించింది.
● పాన్‌గల్ సింగిల్‌విండో కార్యాలయానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసు సిబ్బంది రైతులను వరుసలో నిలబెట్టి యూరియా పంపిణీ చేశారు. ఏడీఏ తిప్పేస్వామి, ఇన్‌చార్జ్ ఏఓ డాకేశ్వర్‌గౌడ్ పర్యవేక్షించారు.

అన్నదాతల అవస్థలు

అన్నదాతల అవస్థలు