
సృజనాత్మకత వెలికితీయాలి
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్‌ఫేర్లు ఎంతో ఉపకరిస్తాయి. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్న ఇన్నోవేషన్ ఇన్‌స్పైర్ మనక్ ముఖ్యంగా నాణ్యత, సైన్స్ అభివృద్ధికి దోహదపడుతుంది. పూర్తిగా కొత్త వాటిని పరిచయం చేసేందుకు విద్యార్థులను సిద్ధం చేయాలి. గణితం, సామాన్యంపై దృష్టిపెట్టేలా సంబంధిత టీచర్లు చొరవ చూపాలి. ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్ ఏర్పాటు చేసి పిల్లల ఇన్నోవేషన్‌లను స్వీకరించాలి. – భానుప్రకాష్,
జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట