
నిర్మాణాల్లో నిర్లక్ష్యం
కొత్త మున్సిపాలిటీలపై గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. రూ.కోటి నిధులతో అట్టహాసంగా వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టి 50 శాతం పనులు చేసినా.. కాంట్రాక్లర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు అర్ధాంతంగా నిలిచిపోయాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బిల్లులు చెల్లించి పనులను పూర్తి చేయించాలి.
– రాజు,
సీపీఎం మండలకార్యదర్శి, ఆత్మకూర్.
బిల్లులు అందక అప్పులపాలు
మూడేళ్ల క్రితం ఆగమేఘాల మీద వైకుంఠధామాల నిర్మాణ పనులు చేయించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. అమరచింత, ఆత్మకూర్ మున్సిపాలిటీల్లో 60 నుంచి 70 శాతం వరకు పనులు చేశాం. రూ.44 లక్షల చొప్పున బిల్లులు రావాల్సి ఉండగా నేటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పులపాలై వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నాం. ఇప్పటికై న మాకు రావాల్సిసిన బిల్లులు చెల్లించి పనులు పూర్తి చేసేందుకు ప్రోత్సహించాలి.
– సత్యనారాయణరెడ్డి, కాంట్రాక్టర్
●

నిర్మాణాల్లో నిర్లక్ష్యం