
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
వనపర్తిటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా బీజేపే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్. ప్రకాష్‌రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీకృష్ణ గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్‌షాప్ కు ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి స్థానిక ఎన్నికలు గుర్తు రాలేదని ఎద్దేవా చేశారు. వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ఏదైనా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థిని పోటీలో నిలబెడతామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో దేశంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పురుషోత్తంరెడ్డి, సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, పోతుగంటి భరత్‌ప్రసాద్, లోకనాథ్‌రెడ్డి, రామన్‌గౌడ్, కదిరె మధు, జ్యోతి, రమణ, అలివేలమ్మ, కుమారస్వామి, సుమిత్రమ్మ, సీతారాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, బాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.