
‘దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు’
వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి బాల్‌రెడ్డి అధ్యక్షతన సీపీఎం వనపర్తి జిల్లా నాయకత్వపు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జబ్బార్‌తో కలిసి ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం, మతతత్వంపై అవగాహన కల్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని, కానీ నేడు దేశభక్తి గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేకంగా పాలన చేస్తుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, నాయకులు రాజు, పరమేశ్వరచారి, లక్ష్మి, మేకల ఆంజనేయులు, బాల్యనాయక్, ఆర్‌ఎన్ రమేష్, గుంటి వెంకటయ్య, ఆది, మహబూబ్, పాష, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.