
మరమ్మతుల జాడేది?
జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట సమస్యలు
●
నిధులు కేటాయించాలి..
జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట ఉన్న రంధ్రాలను పూడ్చటంతో పాటు లైనింగ్ దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించి మరమ్మతులకు నిధులు కేటాయించాలి. రెండేళ్లుగా కాల్వ వెంట మరమ్మతులు చేపట్టడం లేదు. కనీసం పూడికతీత, ముళ్లపొదల తొలగింపు వంటి పనులైనా పూర్తిచేయాలి.
– హన్మంతు, రైతు, నందిమళ్ల
ప్రతిపాదనలు పంపించాం..
ప్రధాన ఎడమ కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి అందజేశాం. నిధులు మంజూరు చేస్తే మరమ్మతులు చేపడతాం.
– జగన్మోహన్,
ఈఈ, జూరాల జలాశయం
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ అధికారులు రెండేళ్లుగా సంబంధితశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నా.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుగాకపోవడంతో మరుగునపడ్డాయి. ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడటాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతులకు ఎన్ని నిధులు అవసరం అన్న విషయాలను నివేదిస్తూనే ఉన్నారు. వర్షాకాలం రాకముందే మరమ్మతులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. నిధులు ఎప్పుడు మంజూరవుతాయని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జూరాల ప్రధాన జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. ప్రాజెక్టు సమీపంలో ఉన్న వాటిని గుర్తించలేని అధికారులు వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎప్పుడు గుర్తిస్తారని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ మరమ్మతులకు అధికారులు సిద్ధమయ్యారు. వీటిని గతేడాది వేసవిలో పూర్తి చేయాలని నిర్ణయించినా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, కత్తేపల్లిలో రెండు ప్రధాన పనులు నిలిచిపోయాయి. వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఆయకట్టు ఇలా..
జూరాల జలాశయం ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు మొత్తం 1.20 లక్షల ఎకరాలుగా నిర్ధారించినా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలుగుతున్నారు. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల మీదుగా 100 కిలోమీటర్ల పొడవునా కాల్వ విస్తరించి ఉంది. వీటిని ఆయా మండలాల్లో కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్‌దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీటిని ఎడమకాల్వ వెంటే విడుదల చేస్తుంటారు.
పెచ్చులూడిన లైనింగ్
రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం
నిధుల మంజూరుకు ఎదురుచూపులు
ముగుస్తున్న వేసవి..
వర్షాకాలంలో గండ్లు పడే ప్రమాదం

మరమ్మతుల జాడేది?

మరమ్మతుల జాడేది?