
దేశ సమైక్యత కోసమే జై సంవిధాన్ యాత్ర
పెద్దకొత్తపల్లి: దేశ సమైక్యత కోసమే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర చేపట్టామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్ గ్రామంలో కొనసాగిన జైసంవిధాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానికంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి యాత్ర ప్రారంభించగా.. చెన్నపురావుపల్లి గ్రామం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, నాయకులు నర్సింహ, విష్ణువర్ధన్‌రెడ్డి, గోపాల్‌రావు, మధు, వెంకటస్వామి, శివకుమార్‌రావు, చిన్నయ్య, ఎల్లయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.