
అన్నదాతలపై ఆరి్థక భారం
పంచాయతీ కార్యదర్శుల శిక్షణలో
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య
అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాల ఉప ప్రణాళిక పథకం కింద రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాకు వివిధ రకాల పరికరాలను అందించేందుకు గాను నిధులు మంజూరు చేస్తుంది. మార్చి 21న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. 2024– 25 ఆర్థిక సంవత్సరం ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాకు 1,341 యూనిట్లకు గాను రూ.3,30,53,000 నిధులు మంజూరయ్యాయి. మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతంపై వీటి ఇవ్వాలని సూచించారు. తక్కువ సమయం ఉండటంతో ప్రచారం కల్పించలేకపోయారు. దీనిపై ఇప్పటికే వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరణలో జాప్యంతో లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైంది. ఈలోగా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మంజూరైన నిధులను వినియోగించలేకపోయారు. దీంతో 2025– 26 కొత్త ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలు చేస్తారా.. లేదా.. అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సం కింద నిధులు, దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వానికి వ్యవసాయ శాఖ నివేదిక పంపించారు.
అందించే పరికరాలు ఇవే..
రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికోసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, మొక్కజొన్న పట్టే యంత్రాలు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. కేజీ వీల్స్, తైవాన్ పంపులు, రొటోవేటర్లు, చేతిపంపులు ఎక్కువగా మంజూరయ్యాయి. ఎంపిక చేసిన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
ఏడేళ్ల తర్వాత..
వ్వవసాయానికి సంబంధించి ఐదేళ్లుగా వాతావరణం అనుకూలిస్తున్నా.. అన్నదాతలకు ప్రభుత్వం సాయం కరువైంది. ఏడేళ్లుగా యంత్ర సాయం లేకపోవడంతో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి. 2017 వరకు ఏటా వానాకాలంలో రాయితీ పరికరాలను అందించగా తర్వాత నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని, రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
ఖర్చులు, సమయం ఆదా..
కూలీ ఖర్చులతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవాలని రైతులు ఎక్కువగా యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఏటా యంత్రాల కోసం దరఖాస్తు చేయడం.. ఎదురుచూడటం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం మార్చి నెల గడువు కాగా.. కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల వారీగా ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను మండలాలకు కేటాయించడం తదుపరి మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం.. అనంతరం జిల్లా కమిటీ ద్వారా ఆమోదం తెలిపి, కలెక్టర్ అనుమతితో రైతులకు అందజేయాలి. కాగా.. జిల్లాకు 2014– 15లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేయగా.. 2016 నుంచి మాత్రం కేటాయింపులు ఒక రకంగా మంజూరు మరో రకంగా ఉంటోంది. మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో నిధులిచ్చే ప్రక్రియ ఊసేలేదు.
ట్రాక్టర్‌తో కరిగెట దున్నుతున్న ఓ రైతు
2016లో తొలి విడత..
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తొమ్మిదేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత నిధులు కేటాయించగా.. తదుపరి కార్యాచరణ కరువైంది. ఈ పథకానికి రూ.5 కోట్లు కేటాయించి, రైతులకు పరికరాలు, అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇచ్చేవారు. ఏళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
వ్యవసాయ యంత్రాలకు చేయూత కరువు
మహిళా రైతులకు 50, ఇతరులకు 40 శాతం రాయితీ పరికరాలు
ఆర్థిక సంవత్సరం ముగియడంతో లబ్ధిదారుల ఎంపికకు బ్రేక్
2018 నుంచి నిధులుకేటాయించని వైనం
వ్యవసాయ యాంత్రీకరణ పథకంపునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం

అన్నదాతలపై ఆరి్థక భారం