పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం నిత్యకృత్యం. సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి చూస్తే.. అలవి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలతో పాటు నదీ తీరానికి రెండు వైపులా ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ ఎవరూ అటువైపు కన్నెత్తి చూడరు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోలు, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలవి వలల గుడారాలే కనిపిస్తాయి.