
నాణ్యమైన బియ్యం సరఫరా
ఖిల్లాఘనపురం: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పురుగులు పట్టిన బియ్యం సరఫరా అయ్యాయి. శుక్రవారం ‘ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భోజన సమయానికి ముందే నాణ్యమైన బియ్యాన్ని వనపర్తి స్టాక్ పాయింట్ నుంచి ఆటోలో వెనికితండా, అప్పారెడ్డిపల్లి, సోళీపురం పాఠశాలలకు తరలించారు. అలాగే పురుగులు పట్టిన బియ్యాన్ని తీసుకెళ్లినట్లు మండల విద్యాధికారి జయశంకర్ వివరించారు.
వెనికితండా పాఠశాలకు వచ్చిన నాణ్యమైన బియ్యం

నాణ్యమైన బియ్యం సరఫరా