స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వేదికగా జరగనున్న ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేసేందుకు అధికార, పాలకవర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. సుమారు 20 వేల మందిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లు కాంగ్రెస్‌పార్టీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. పలువురు ప్రధాన నాయకులు సీఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.