దోచుకొని దాచుకోవడం బీఆర్‌ఎస్‌ నైజం : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

దోచుకొని దాచుకోవడం బీఆర్‌ఎస్‌ నైజం : ఎమ్మెల్యే

Feb 28 2025 12:54 AM | Updated on Feb 28 2025 12:53 AM

మదనాపురం: గత ప్రభుత్వ హయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని గోవిందహళ్లిలో ఆయన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే దంతనూరు, తిర్మలాయపల్లి, మదనాపురం, నెల్విడి, కొన్నూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి దంతనూరులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తోందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగన్న, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, చర్లపల్లి శేఖర్‌రెడ్డి, జగదీశ్‌, వడ్డె కృష్ణవర్ధన్‌రెడ్డి, నాగన్న యాదవ్‌, హనుమాన్‌రావు, వడ్డె రాములు, మహదేవన్‌గౌడ్‌, వెంకట్‌నారాయణ, శ్రావణ్‌కుమార్‌, సాయిబాబా, శ్రీధర్‌రెడ్డి, డైరెక్టర్‌ పావని, ఆవుల రాఘవేంద్ర, వడ్డె బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement