వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రెండురోజుల పాటు జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలు బుధవారం ముగిశాయి. మహాసభలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.మల్లేష్, ఉపాధ్యక్షుడిగా రాఘవ, కార్యదర్శిగా ఎం.ఆది, సహాయ కార్యదర్శిగా రామకృష్ణ, సభ్యులుగా రాజవర్ధన్, ఆంజనేయులు, వీరన్ననాయక్, మోహన్, మల్లీశ్వరి, రమేశ్, కార్తీక్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రామన్‌పాడులో 1,021 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాలువ నుంచి 550 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని చెప్పారు. ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 88 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు.