బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి

Feb 26 2025 7:56 AM | Updated on Feb 26 2025 7:52 AM

వనపర్తి: బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్‌ లీడ్‌ బ్యాంకు డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ (ఏఎల్డీఎం) సాయి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆశా కార్యకర్తలకు ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎల్డీఎం మాట్లాడుతూ.. ఆర్థిక అక్షరాస్యత పొదుపుతోనే సాధ్యమవుతుందని, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి, సురక్షా బీమా యోజనను వినియోగించుకోవాలని సూచించారు. అటల్‌ పెన్షన్‌ యోజన, సుకన్య సమృద్ధి యోజన గురించి వివరించారు. రూ.20తో బీమా చేయించుకుంటే ఆపద సమయాల్లో బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా సొమ్ము అందుతుందన్నారు. బీమా చేయించుకొని ధీమాగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement