వనపర్తి | - | Sakshi
Sakshi News home page

వనపర్తి

Apr 2 2023 1:30 AM | Updated on Apr 2 2023 1:30 AM

- - Sakshi

ప్రజల సహకారంతోనే స్వచ్ఛత
సాహసయాత్ర.. సలేశ్వరం

వాతావరణం

రోజంతా ఎండ తీవ్రత సాధారణంగా

ఉంటుంది. అప్పుడప్పుడూ ఆకాశం తేలికపాటి మేఘామృతమై ఉంటుంది.

వివరాలు 10లో u

ఆదివారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2023

వివరాలు 8లో u

ఇలా చేరుకోండి..

హైదరాబాద్‌– శ్రీశైలం జాతీయ రహదారి 765లోని మన్ననూర్‌ అనంతరం ఫర్హాబాద్‌ చౌరస్తా వస్తుంది. ఇది 157 కి.మీ. మైలురాయి వద్ద ఉంటుంది. శ్రీశైలం వైపు నుంచి వచ్చేవారు దోమలపెంట, వట్టువర్లపల్లి మీదుగా ఫర్హాబాద్‌ చౌరస్తాకు చేరుకోవాలి. నల్లగొండ నుంచి వచ్చేవారు మల్లేపల్లి, దేవరకొండ, డిండి నుంచి హాజీపూర్‌ చౌరస్తాకు వచ్చి అక్కడి నుంచి శ్రీశైలం మార్గంలో ఫర్హాబాద్‌ చేరుకోవాలి. మిర్యాలగూడ నుంచి వచ్చే అంగడీపేట, పెద్ద ఊర, మల్లేపల్లి, దేవరకొండ, డిండి మీదుగా హాజీపూర్‌ చౌరస్తా, మన్ననూర్‌ మీదుగా ఫర్హాబాద్‌ వెళ్లాల్సి ఉంటుంది. ఫర్హాబాద్‌ చౌరస్తా హైదరాబాద్‌ నుంచి 157 కి.మీ., మహబూబ్‌నగర్‌ నుంచి 131 కి.మీ., నల్లగొండ నుంచి 141 కి.మీ., అచ్చంపేట నుంచి 38 కి.మీ., మన్ననూర్‌ నుంచి 18 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. ఫర్హాబాద్‌ చౌరస్తా నుంచి అప్పాపూర్‌ చెంచుపెంట, రాంపూర్‌పెంట మీదుగా 31 కి.మీ. దూరంలో దట్టమైన అటవీ మార్గంలో సలేశ్వర క్షేత్రం ఉంటుంది.

● ఇదే కాకుండా బల్మూర్‌, లింగాల– అప్పాయిపల్లి ద్వారా మరో మార్గం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే అతి కష్టమీద సంగండిగుండాల వరకు ట్రాక్టర్ల ద్వారా వెళ్లేందుకు దారి ఉంది. కానీ, ఈ మార్గంలోభక్తులందరూ కాలినడకనే వెళ్తుంటారు.

ఇఫ్తార్‌ 6–08

(ఆదివారం సాయంత్రం)

వనపర్తి/వనపర్తి టౌన్‌/వనపర్తి క్రైం: ప్రజల సహకారంతోనే సంపూర్ణ స్వచ్ఛత సాధించవచ్చని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ ఉత్సవ, మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శనివారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛతలో పారిశుద్ధ్య కార్మికులతోపాటు ప్రజల చొరవ కీలకమన్నారు. ప్లాస్టిక్‌ కవర్లకు బదులు జూట్‌ సంచులు వాడాలని ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో స్వచ్ఛతలో వనపర్తి ముందుండేందుకు పనిచేయాలని, చేయిచేయి కలిపితేనే స్వచ్ఛత ఏర్పడుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. అనంతరం ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.52లక్షలతో జిల్లా కేంద్రంలోని పుణ్యనాయక్‌ తండా టూ మర్రికుంట వరకు మంజూరైన రోడ్డుకు కలెక్టర్‌ భూమి పూజ చేశారు.మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీధర్‌, కమిషనర్‌ విక్రమసింహరెడ్డి, డీఈ సూర్యనారాయణ పాల్గొన్నారు.

పారదర్శకంగా గొర్రెల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న రెండవ విడత గొర్రెల పంపిణీ ప్రక్రియను జిల్లాలో పారదర్శకంగా అమలు చేస్తామని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ చెప్పారు. శనివారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సీఎస్‌ శాంతి కుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. గొర్రెలను రవాణా చేసేందుకు నిర్వహించే టెండర్‌ ప్రక్రియ నిబంధనల మేరకు జాగ్రత్తగా పూర్తి చేయాలని, జిల్లాలో లబ్దిదారుల జాబితా సిద్ధం చేయాలని, గత జాబితాను క్షేత్రస్థాయిలో పర్యటించి పునఃపరిశీలన చేయాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని క్వాలిటీ కంట్రోల్‌ బృందాలు ప్రతి రోజూ ఫీల్డ్‌ లెవల్‌ పరిశీలన చేయాలని సూచించారు. వీసీలో అడిషనల్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఆర్డీఓ పద్మావతి, డీఎంహెచ్‌ఓ రవిశంకర్‌, పీఆర్‌ ఈఈ మల్లయ్య పాల్గొన్నారు.

సహర్‌ 4–55

(సోమవారం తెల్లవారుజామున)

తెలంగాణ అమరనాథ్‌ యాత్రగా ప్రసిద్ధి

దట్టమైన నల్లమలలో కొలువుదీరిన లింగమయ్య

ఈ నెల 5, 6, 7 తేదీల్లో సలేశ్వరం బ్రహ్మోత్సవాలు

పౌర్ణమి రోజు లక్షమందికిపైగా పుణ్యస్నానాలు

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతి

సాగును నమ్ముకున్నాం.. సాయం చేయండి

వనపర్తి/కొత్తకోట రూరల్‌: దశాబ్దాలుగా.. దేవుడి మాన్యంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాం.. ప్రభుత్వం నుంచి రైతులకు అందే సంక్షేమ పథకాలు ఏవీ మాకు అందటం లేదు, కనీసం రైతుబీమానైనా.. వర్తింపజేయాల అని పెద్దమందడి మండలం గట్లఖానాపుర్‌, స్కూల్‌తండా వాసులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వారు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను వివరించారు. అవకాశం ఉంటే రైతుబంధు వచ్చేలా చేయాలని, ఇళ్లులేనివారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. అందుకు స్పందించిన మంత్రి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి ఆయా గ్రామాల ప్రజలకు చెప్పారు. రెండు మూడు తరాలుగా ఈ భూముల్లోనే.. పంటలు సాగుచేసుంటూ జీవిస్తున్నామని ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి చెప్పారు. వారితో పాటు ఉపసర్పంచు మన్యం నాయక్‌, నాయకులు రాజునాయక్‌, కృష్ణానాయక్‌ తదితరులు ఉన్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌తో ఆరోగ్య భరోసా

ఖిల్లాఘనపురం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు ప్రతి కుటుంబానికి చేరేలా చూడాలని, ఈ కార్డు ద్వారా ఆరోగ్య భరోసా ఉంటుందని కేరళ బీజేపి రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సినీ మనోజ్‌ అన్నారు. శనివారం ప్రవాస్‌ యోజన కార్యక్రమంలో భాగంగా ఖిల్లాఘనపురం వచ్చిన ఆమె జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డితో కలిసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గూర్చి ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడే పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆయుస్మాన్‌ భారత్‌ పథకాన్ని తీసుకొచ్చారని, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలన్నారు. అలాగే, కేంద్రం అందిస్తున్న బీమా పథకాలు, పెట్టుబడి సాయం, ఉచిత బియ్యం తదితర పథకాలు గడప గడపకు చేరేలా చూడాలన్నారు. అనంతరం ఆమె మహ్మదుస్సేన్‌పల్లికి వెళ్లే దారిలో అల్లిపేటగుట్టపై శిథిలావస్థకు చేరిన పద్మనాభస్వామి ఆలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, కల్పన, బుచ్చిబాబుగౌడు, ఆశన్న, శ్రీనివాస్‌గౌడు, ప్రవీణ్‌, ఆంజనేయులు, శివశంకర్‌ దితరులు పాల్గొన్నారు.

శనేశ్వరాలయంలో పూజలు

బిజినేపల్లి: శనిదోష నివారణ కోసం ఆయా ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన జేష్ట్యాదేవి సమేత శనేశ్వరుడికి తిలతైలాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో భక్తుల చేత పూజలు, హారతి, ప్రదక్షిణలు చేయించారు. అనంతరం పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివాలయంలో శివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు.

ఎత్తయిన కొండలు.. జాలువారే జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన సలేశ్వరం లింగమయ్య దర్శనం చేసుకోవాలంటే ఎంతో సాహసం చేయాల్సిందే. రాళ్లు.. రప్పల్లో కిలోమీటర్ల మేర కాలినడకన అడుగులు వేస్తూ.. కొండలు ఎక్కి దిగుతూ.. సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని పున్నమి వెన్నెల్లో స్వామి సన్నిధికిచేరుకోవాల్సి ఉంటుంది. లోయలో ప్రతిధ్వనించేలింగమయ్య నామస్మరణ.. దారి పొడవునా పడే నీటి తుంపర్లు.. వెయ్యి అడుగులపై నుంచి జాలువారే జలపాతం.. ఇలా ఒక్కోదృశ్యం ఒక్కో అద్భుతం. ఒక్కసారి ఈ యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రగా ప్రసిద్ధిగాంచిన ఈ యాత్ర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ప్రత్యేక కథనం..

పిడికెడుశివలింగం..

త్తడితో చేసిన పడగ మధ్యలో కేవలం పిడికెడు ఎత్తు గల శివలింగం రూపంలో సలేశ్వర లింగమయ్య కొలువుదీరి ఉంటాడు. జలపాతం వద్ద భక్తులు కొండపైకి ఎగబాకి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. లక్షలాది మందితో నల్లమల అడవి తల్లి నిండుగా కనిపిస్తుంది. ఈ ఉత్సవాల తర్వాత ఈ ప్రాంతానికి వెళ్లడానికి ఎవరూ సాహసించరు.

వైద్య కళాశాల పనులు

వేగవంతం

ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మర్రికుంట వద్ద నిర్మిస్తున్న వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అధికారులతో పనుల ప్రగతిపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

విద్యుత్‌ సమస్యపై అసంతృప్తి

ఇదిలాఉండగా, కలెక్టర్‌ మెడికల్‌ కళాశాలను సందర్శించిన సమయంలో విద్యుత్‌ లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్‌ సమస్య ఉంటే విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ఎలా ఇస్తారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కలెక్టర్‌ వెంట మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సునందిని తదితరులు ఉన్నారు.

– ‘సాక్షి’మహబూబ్‌నగర్‌ డెస్క్‌

లేశ్వరం లింగమయ్య దర్శనం ఓ మహత్తర ఘట్టం. పేద, ధనిక.. చిన్నా పెద్ద.. ముసలి ముతక.. ఇలా ఎవరైనా సరే ప్రమాదభరితమైన కొండల్లో కాలినడకన గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు.. ‘వస్తున్నాం లింగమయ్య’.. తిరిగి వచ్చేటప్పుడు ‘వెళ్లొస్తాం లింగమయ్య’.. అంటూ భక్తిపారవశ్యంతో కదులుతారు. ప్రతి ఏటా ఏప్రిల్‌లో వచ్చే చైత్ర పౌర్ణమి సందర్భంగా నిర్వహించే సలేశ్వరం జాతర తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రగా పేరుగాంచింది. అటవీశాఖ ఆంక్షల మధ్య ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అనుమతి లభించింది. అది కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.

● నల్లమల లింగమయ్య యాత్ర 200 అడుగుల లోతున పదునైన రాళ్లతో కూడిన గుట్టను దిగడంతో ప్రారంభమవుతుంది. గుట్టను దిగిన తర్వాత 500 అడుగుల నుంచి 600 అడుగుల ఎత్తు ఉండే మరో గుట్టను ‘వస్తున్నాం లింగమయ్య..’ అంటూ భక్తి ప్రపత్తులతో వేడుకుంటూ ముందుకు సాగుతుంటారు. దాదాపు వెయ్యి అడుగులకు పైగా లోతైన లోయవైపు కొండ చరియలను ఆధారంగా చేసుకొని.. కర్రల సాయంతో దిగాల్సి ఉంటుంది. అతి ప్రమాదకరమైన కొండలు, లోయల్లో భక్తులు కాలినడక ప్రయాణం సాగిస్తుంటారు. అయితే సలేశ్వరం జాతర అంటేనే పున్నమి వెన్నెల్లో రాత్రి వేళ చేసే ప్రయాణం. అలాంటిది పగలు మాత్రమే అనుమతిస్తే మండుటెండల్లో కాలికి చెప్పులు లేకుండా రాళ్లు, రప్పల్లో కాలినడకన వెళ్లడం సాధ్యమయ్యే పనేనా అని భక్తులు, యాత్రికులు ప్రశ్నిస్తున్నారు.

అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు

కొత్తకోట: వాహనదారులకు అవగాహన లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో ఎక్కువగా మద్యం మత్తులో జరుగుతున్నాయని ఏఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డారు. శనివారం పట్టణంలో పోలీస్‌ శాఖ, ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స, క్షతగాత్రులకు ధైర్యం ఇచ్చుటపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తే ఆ కుటుంబంలో తీరని వేదనతోపాటు కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. వీటిని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రమాదకరమైన రహదారులను, డెంజర్‌ స్పాట్లను గుర్తించి రక్షణ చర్యలు చేపడుతున్నామని వివరించారు. అనంతరం ఈఎంఆర్‌ఐ హెల్త్‌ సర్వీస్‌ వైద్యుడు సతీష్‌ మాట్లాడుతూ.. ఎక్కరైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే వెంటనే గాయపడ్డ వారికి మీకేం కాదు.. మేమన్నామనే ధైర్యం ఇవ్వాలన్నారు. అలాగే, క్షతగాత్రులకు అందించాల్సిన ప్రథమ చికిత్స, దైర్యం చెప్పడం వంటి అంశాలను ప్రదర్శనల ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, రోడ్‌ సేఫ్టి వింగ్‌ డీఎస్పీ చంద్రబాబు, కొత్తకోట సీఐ శ్రీనువాస్‌రెడ్డి, కొత్తకోట, పెద్దమందడి ఎస్‌ఐలు నాగశేఖర్‌రెడ్డి, హరిప్రసాద్‌, కొత్తకోట పోలిస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కొండల మధ్య కాలినడకన లింగమయ్య దర్శనానికి వెళ్తున్న భక్తులు (ఫైల్‌)

ఆత్మీయతతోనే లక్ష్య సాధన

ఒత్తిడి లేకుండా

‘పది’ పరీక్షలు రాయాలి

ఖిల్లాఘనపురం: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జీసీడీఓ శుభలక్ష్మీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఇంగ్లిష్‌ మీడియం కేజీబీవీ పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించడంతో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు భయపడకుండా ప్రశ్నపత్రాన్ని చదివి అర్థం చేసుకొని జవాబులు రాయాలన్నారు. తొందరపడి ప్రశ్నను అర్థం చేసుకోకుండా తప్పుడు జవాబు రాయడం వలన ఫలితాలు మారుతాయన్నారు. అలాగే, వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడంతో పాటు, పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎవరూ అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు 10వ తరగతి హాల్‌టికెట్లు పంచారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వనపర్తి టౌన్‌: స్వచ్ఛతపై ఎక్కడికక్కడ ఆత్మీయంగా చర్చిస్తూ ముందుకెళ్తే ఫ్రీ పట్టణంగా వనపర్తి అనతి కాలంలోనే రూపుదిద్దుకుంటుందని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ పేర్కొన్నారు. శనివారం మున్సిపల్‌ కమిషనర్‌ ఛాంబర్‌లో మెప్మా ఆర్పీలు, ఉద్యోగులు, మున్సిపల్‌ హాల్‌లో పారిశుద్ధ్య కార్మికులతో జరిగిన వేర్వేరు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అధికారంతో చెబుతున్నట్లుగా కాకుండా ఆత్మీయతతో తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం, ఎక్కడికక్కడ పరిశుభ్రతను పాటించడం ఆయా కాలనీలో ఆర్పీలు ఆప్యాయంగా, ఆత్మీయంగా మాట్లాడడం అలవర్చుకుంటే మున్సిపాలిటీ ఆశించిన మార్పు వస్తుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలిక తరపున అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని, చిన్నచిన్న పట్టణాలు, అతి చిన్న గ్రామాలు స్వచ్ఛతలో ముందుంటున్నాయని, వాటన్నింటికి మించి వనపర్తిని ముందు నిలిపేలా కలసికట్టుగా ప్రయత్నిద్దమన్నారు. వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ మాట్లాడుతూ.. ఆర్పీలు ప్రతి మహిళను స్వచ్ఛతపై కార్యోన్ముఖులు చేయాలని, వనపర్తి స్వచ్ఛ పట్టణంగా మారేంత వరకు ఆర్పీల సేవలను వినియోగించుకుంటామన్నారు. వార్డుల వారీగా టీంలను ఏర్పాటు చేసి ప్రతి రోజు రెండు వార్డుల చొప్పున పక్షం రోజుల్లో స్వచ్ఛ ఉత్సవ కార్యక్రమాలను ముగిస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ విక్రమసింహా రెడ్డి, శానిటరీ ఇన్స్‌ఫెక్టర్‌ ఉమామహేశ్వర్‌ రెడ్డి, మెప్మా అధికారులు బాలరాజు, యువరాజు, సరస్వతి, కౌన్సిలర్‌ చీర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మహాత్మాగాంధీ, డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని జేఎన్‌యూ (న్యూఢిల్లీ) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.జి.అజయ్‌ సూచించారు. శనివారం స్థానిక ఎన్టీయార్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. మహనీయుల ఆలోచనా విధానాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. డిగ్రీ కళాశాలల సంయుక్త సంచాలకులు డా.రాజేందర్‌సింగ్‌ మాట్లాడుతూ ఇలాంటి వెబినార్లతో విద్యార్థుల్లో సామాజిక అవగాహన పెరుగుతుందన్నారు. అందరూ ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు.

న్యూస్‌రీల్‌

భక్తులకు వసతులు..

రాంపూర్‌ చెంచుపెంట నుంచి సలేశ్వరం వరకు విడిది, తాగునీటి కోసం అక్కడక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. రాంపూర్‌పెంట దాటిన తర్వాత వాహనాల పార్కింగ్‌ ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో మోకాల కుర్వు, గాడిదదొన్న కాల్వ వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడి నుంచి వెళ్లే దారి లో ఇప్పచెట్టుబండ, అప్పాయిపల్లి దారి, మైసమ్మకట్ట, పాపనాశనం, లోయప్రాంతం, బైరవుడి గుడి వస్తాయి. అనంతరం లోయలోకి దిగి ముందుకు వెళితే.. శంకుతీర్థం, సలేశ్వర తీర్థం గుండా లు వస్తాయి. సలేశ్వరతీర్థం వద్ద భారీ జలపాతం నుంచి నీరు జాలువారుతాయి. ఇక్కడి గుహలోనే సలేశ్వరం లింగమయ్య కొలువుదీరాడు.

జాతర జరిగే రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈసారి కూడా అచ్చంపేట, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, గద్వాల, నల్లగొండ జిల్లా దేవరకొండ, మిర్యాలగూడ డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.

మహనీయుల ఆశయాలతో ముందుకు సాగాలి

1
1/17

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌  2
2/17

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తున్న ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్‌ 3
3/17

ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తున్న ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్‌

4
4/17

5
5/17

6
6/17

7
7/17

8
8/17

మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ 
9
9/17

మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌

విద్యార్థులకు హాల్‌టికెట్లు అందజేస్తున్న జీసీడీఓ 10
10/17

విద్యార్థులకు హాల్‌టికెట్లు అందజేస్తున్న జీసీడీఓ

11
11/17

12
12/17

13
13/17

14
14/17

15
15/17

16
16/17

17
17/17

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement