జిల్లా కేంద్రంలో చాగంటి ప్రవచనం | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రంలో చాగంటి ప్రవచనం

Apr 30 2026 9:36 AM | Updated on Apr 30 2026 9:36 AM

హాజరైన హైకోర్టు జడ్జి దంపతులు

పార్వతీపురం: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన వక్త, ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. బెలగాంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి శతాబ్ది ప్రయుక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పారు. ధర్మం, నైతిక విలువలు, కుటుంబ జీవన విధానం, భక్తిమార్గం తదితర అంశాలపై ఆయన చేసిన ప్రవచనాలు అన్ని వర్గాలవారిని ఆకర్షించాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చాగంటి పార్వతీపురం పట్టణం రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జి సీహెచ్‌.మానవేంద్రనాఽథ్‌ రాయ్‌ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement