ఓవరాల్‌ చాంపియన్‌ భువనేశ్వర్‌ సైనిక్‌ స్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంపియన్‌ భువనేశ్వర్‌ సైనిక్‌ స్కూల్‌

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

ఓవరాల్‌ చాంపియన్‌ భువనేశ్వర్‌ సైనిక్‌ స్కూల్‌

ముగిసిన ఆలిండియా సైనిక పాఠశాలల హాకీ టోర్నీ

విజేతలకు ట్రోఫీలు అందజేత

విజయనగరం రూరల్‌: ఆలిండియా సైనిక సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు కోరుకొండ సైనిక పాఠశాలలో నిర్వహించిన ఆలిండియా సైనిక పాఠశాలల హాకీ టోర్నీ– 2026 (ఇంట్రా గ్రూఫ్‌– ఎఫ్‌) ఓవరాల్‌ చాంపియన్‌గా భువనేశ్వర్‌ సైనిక పాఠశాల నిలిచింది. అండర్‌–15 సబ్‌ జూనియర్‌ (బాలురు), అండర్‌– 17 జూనియర్‌ (బాలురు, బాలికలు) విభాగాల్లో నిర్వహించిన ఈ టోర్నీలో కోరుకొండ సైనిక పాఠశాల జట్టుతో పాటు, అంబికాపూర్‌ సైనిక పాఠశాల (ఛత్తీస్‌గఢ్‌) భువనేశ్వర్‌, సంబల్‌పూర్‌ సైనిక పాఠశాలల (ఒడిశా) జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. అండర్‌– 15 బాలుర సబ్‌ జూనియర్‌ విభాగంలో కోరుకొడ సైనిక పాఠశాల విజేతగా నిలవగా, అండర్‌–17 బాలికల జూనియర్‌ విభాగంలో విజేతగా సంబల్‌పూర్‌ జట్టు నిలిచింది. అండర్‌– 17 బాలుర విభాగం విజేతగా భువనేశ్వర్‌ పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్‌, గ్రూప్‌ కెప్టెన్‌ ఎస్‌ఎస్‌ శాస్త్రి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు పోటీతత్వమే కాకుండా, క్యాడెట్ల మధ్య ఐక్యత, క్రమశిక్షణ, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ టోర్నీలో నిజమైన విజయం కేవలం గెలుపుకాదని, మైదానంలో క్యాడెట్లు ప్రదర్శించిన వ్యక్తిత్వం, దృఢత్వం, క్రీడాస్ఫూర్తి గెలుపు అని అన్నారు. రాబోయే ఇంటర్‌ గ్రూప్‌ జాతీయ హాకీ చాంపియన్‌షిప్‌లో గ్రూప్‌ ఎఫ్‌ విజేత జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ వింగ్‌ కమాండర్‌ కిరణ్‌.వి, పరిపాలనాధికారి స్క్వాడ్రన్‌ లీడర్‌ అతుల్‌ జాన్‌ థామస్‌, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement