● ఆందోళన చెందుతున్న బాధితులు
బొబ్బిలిరూరల్: మండలంలోని ఎం.బూర్జివలసకు చెందిన సుమారు 60 మంది నుంచి కోటిన్నర రూపాయల అప్పుచేసిన గేదెల పుణ్యవతి అనే మహిళ పరారైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పదిరోజులుగా పుణ్యవతి ఇంటి తలుపులు మూసి ఉండడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ప్రాంశరీనోట్లు పట్టుకుని బాధితులు వచ్చారు. సీఐ నారాయణరావు అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు పి.రత్నమ్మ, జి.పార్వతి, జి.కృష్ణమ్మ, కోలా నారాయణరావు గోడువెళ్లబోశారు.


