పాలకొండ రూరల్: పీఆర్‌టీయూ రాష్ట్ర శాఖ పిలుపుతో సీపీఎస్ రద్దు కోరుతూ ఈ నెల 21 నుంచి కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా చేపట్టనున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వాలేటి తవిటినాయుడు, అసోసియేట్ అధ్యక్షుడు శశికుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాలకొండ వచ్చిన వారు ఎంఆర్‌సీ వద్ద స్థానిక ఉపాధ్యాయులతో సమావేశమై మద్దతు కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. 30 శాతం ఐఆర్ అందించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చాలని కోరుతూ ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంఽధించిన కరపత్రాలను విడుదల చేశారు.


