బొబ్బిలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థలు, పెద్దలకు వేల ఎకరాలు అప్పనంగా దోచిపెడుతున్నా పేదలకు మాత్రం రెండు సెంట్ల స్థలాన్ని ఆవ్వడం లేదని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల ఇళ్లు కాలిపోయిన వారికి ఆర్థిక సహాయం కానీ, ఇళ్లు లేని వారికి సెంటు స్థలం కానీ ఇవ్వడం లేదన్నారు. తెర్లాం మండలం చిన గొలుగువలసలో మూడు నెలలకిందట 12 పూరిళ్లు కాలిన సంఘటనలో సజీవదహమైన వృద్ధురాలి కుటుంబానికి ఎటువంటి సహాయం కూడా చేయలేదన్నారు. కొంతమంది బడాబాబులు రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని పట్టణాల్లో స్థలాలు, గ్రామాల్లో భూములను ఆక్రమించుకుంటున్నారని, అదే రాజకీయ నాయకులు మాత్రం పేద ప్రజలకు ఇంటి స్థలం ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వజ్జి రవికుమార్, రాంబార్కి తిరుపతిరావు, తమ్మిరెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర సాధన సమితి


