రారండోయ్‌ దివ్యదక్షిణ యాత్రలకు | - | Sakshi
Sakshi News home page

రారండోయ్‌ దివ్యదక్షిణ యాత్రలకు

Apr 15 2026 8:56 AM | Updated on Apr 15 2026 8:56 AM

రారండోయ్‌ దివ్యదక్షిణ యాత్రలకు

విజయనగరం టౌన్‌: దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అందిస్తున్న విలువైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ టూరిజం జనరల్‌ మేనేజర్‌ డీఎస్‌జీపీ కిశోర్‌ కోరారు. ఈ మేరకు విజయనగరంలోని రైల్వే కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో టూర్‌ ప్యాకేజీ వివరాలను ఆయన వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ గమ్యస్ధానాలకు వెళ్లే భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలును విశాఖ నుంచి తొలిసారిగా ప్రారంభిస్తున్నామన్నారు. అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం దివ్యదక్షిణ యాత్ర పేరుతో ఏప్రిల్‌ 27న రైలు బయలుదేరనుందని తెలిపారు. 9 రోజుల పాటు యాత్ర ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, తిరుచ్చి, తంజావూరు, తిరువణ్ణామలై దర్శనం కల్పిస్తూ హోటల్స్‌, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌, అల్పాహారం, భోజనం, ప్రయాణ బీమా, రైలు భద్రత, గైడ్‌తో సహా అన్ని సౌకర్యాలను అందిస్తున్నామని వివరించారు, దివ్యయాత్రలో పాల్గొనేందుకు యాత్రికులను, ఆహ్వానిస్తున్నా మన్నారు. అవకాశం ఉన్నవారందరూ 9281030748, 9281495847, లేక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కానీ సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement