వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేద్దాం

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

వైఎస్సార్‌ సీపీ కార్యాలయ

పునఃప్రారంభోత్సవంలో ఎంపీ

గుమ్మ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు

పార్వతీపురం రూరల్‌: వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతానికి అందరం కలిసికట్టుగా పాటుపడదామని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను విజేతలుగా నిలుపుదామని ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని మంగళవారం పునఃప్రారంభించారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గుమ్మా తనూజారాణి మాట్లాడుతూ జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో కమిటీల నిర్మా ణం వేగంగా పూర్తి కావడం హర్షణీయమని, జోగారావు అన్న పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని, ‘కాఫీ విత్‌ క్యాడర్‌’ వంటి వినూత్న కార్యక్రమాలు కార్యకర్తలకు మరింత చేరువయ్యేలా దోహదపడతాయన్నారు.

మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన గ్రామస్థాయి, దాని అనుబంధ కమిటీల ఏర్పాటులో పార్వతీపురం నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. ’రెడ్‌ బుక్‌’ పాలనకు, అరాచకాలకు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలోని అన్నివార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ పోటీచేసి విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మూడు మండలాలు, పురపాలక సంఘం పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బొమ్మి రమేష్‌, పాలవలస మురళీకృష్ణ, బలగ శ్రీరాములునాయుడు, జెడ్పీటీసీ సభ్యులు అలజంగి రవి కుమార్‌, మామిడి బాబ్జి, బలగ నాగే శ్వరరావు, ఎంపీపీలు మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, బలగ రవణమ్మ, వైఎస్‌ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బి.రవికుమార్‌, వెలిది సాయిరాం, పార్టీ ప్రధాన కార్యదర్శులు పోల సత్యనారాయణ, తప్పిట ప్రసాద్‌, పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు సర్వీశెట్టి శ్రీనివాసరావు, మైనారిటీ సెల్‌ అధ్యక్షులు షేక్‌ షఫీ, మాజీ చైర్‌ పర్సన్‌ బోను గౌరీశ్వరి, మాజీ వైఎస్‌ చైర్‌ పర్సన్‌ కొండపల్లి రుక్మిణి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కర్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement