ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ హాకీ టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ హాకీ టోర్నీ ప్రారంభం

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

విజయనగరం రూరల్‌: విజయనగరం కోరుకొండ సైనిక పాఠశాలలో ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ హాకీ టోర్నమెంట్‌ (గ్రూప్‌–ఎఫ్‌) 2026–27 సోమవారం ప్రారంభమైంది. అండర్‌–15 సబ్‌ జూనియర్‌ బాలురు, అండర్‌–17 జూనియర్‌ బాలికలు, బాలుర విభాగాల్లో మూడురోజుల పాటు జరగనున్న పోటీలను పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.ఎస్‌.శాస్త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. క్రమశిక్షణ పెంపొందించడంలో క్రీడల కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని క్రీడాకారులకు సూచించారు. సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంట్‌లో కోరుకొండ (ఆంధ్రప్రదేశ్‌), అంబికాపూర్‌ (ఛత్తీస్‌గఢ్‌), భువనేశ్వర్‌, సంబల్‌పూర్‌(ఒడిశా) సైనిక పాఠశాలల క్యాడెట్లు తలపడనున్నారు. అండర్‌–15 సబ్‌ జూనియర్‌ బాలురు,అండర్‌–17 జూనియర్‌ బాలికలు,బాలుర విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్మించనున్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌, వింగ్‌ కమాండర్‌ వి.కిరణ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, స్క్వాడ్రన్‌ లీడర్‌ అతుల్‌ జాన్‌ థామస్‌, సిబ్బంది, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement