● రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

● రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిందే..

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించేందుకు ప్రభుత్వం చొరవతీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట రజక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహిళలు, వృద్ధులు సహా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వెళ్లగక్కారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారని, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో కూడా తీర్మానం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎస్సీ జాబితాలో కులాన్ని చేర్పించాలని కోరారు. దోబి ఘాట్‌ల అభివృద్ధి, రుణ సదుపాయాలు, సబ్సిడీలు, ఆధునిక యంత్రాలు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెల్ల సత్యం, రాష్ట్ర సహాయ కార్యదర్మి ఎం.పైడిరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement