● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: సెన్సస్–2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయగణన విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రజలే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే ఈ వినూత్న అవకాశం ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల పౌరులు నిర్ణీత గడువులోగా ‘ఎస్‌ఈ.సెన్సెస్.జీఓవీ.ఐఎన్’ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున 15 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమాజంలోని ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ముందుండి తమ వివరాలను నమోదు చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. స్వీయగణన పూర్తిగా స్వచ్ఛందమని ఎవరిపైనా ఒత్తిడి తీసుకురావొద్దని స్పష్టం చేశారు.


