వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

వ్యాన్‌ డ్రైవర్‌కు గాయాలు

రాజాం సిటీ: మండల పరిధిలోని శ్రీకాకుళం రోడ్డు అంతకాపల్లి బ్రిడ్జి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం పోరుపు గ్రామానికి చెందిన పోరుపోలు వీరబాబు కొరియర్‌ వ్యాన్‌తో శ్రీకాకుళం వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి రాజాం వైపు వస్తున్న లారీ అతివేగంగా వస్తూ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌ ముందుభాగం నుజ్జునుజ్జు కాగా అందులోని డ్రైవర్‌ వీరబాబుకు చేయి విరగడంతో పాటు కాలుకు తీవ్రగాయలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని బాదితుడ్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి శ్రీకాకుళం ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ కె.అశోక్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement