40 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

40 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

విజయనగరం క్రైమ్‌: నలుగురు నిందితుల నుంచి 40 ప్యాకెట్లలో 49.147 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల కాలంలో కర్ణాటకకు చెందిన భార్యాభర్తలు వరుణ్‌కుమార్‌ మణి (23), నిషా బైరపురం (19) అనుమానాస్పదంగా సంచరిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ సీఐ శోభన్‌బాబు నేతృత్వంలో సిబ్బంది అరెస్ట్‌ చేశారన్నారు. వారిచ్చిన సమాచారంమేరకు ప్రదీప్‌సురేష్‌ (22), అభిలాష్‌ రవిరావు (21)లను అదుపులోకి తీసుకోగా.. వారి వద్ద 40 ప్యాకెట్ల గంజాయి పట్టుబడిందన్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని.. ఒడిశా నుంచి గంజాయి తీసుకువస్తూ విజయనగరంలో పట్టుబడ్డారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి, ప్రొబేషనరీ ఎస్సై జి.కమలభార్గవ్‌, ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్‌, హెచ్‌సీలు రమణ, గౌరీశంకర్‌, నాయుడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement